Pathapatnam: పాతపట్నంలో జోరు వానలో సర్పంచ్ అభ్యర్థి రాజారావు ప్రచారం

Pathapatnam: పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి, మాజీ హెచ్‌ఎం నల్లి రాజారావు వర్షంలోనూ విస్తృత ఇంటింటి ప్రచారం. తమకే మద్దతివ్వాలని గ్రామీణులకు విజ్ఞప్తి.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 2 Nov 2026 5:43 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో జోరు వానలో సర్పంచ్ అభ్యర్థి రాజారావు ప్రచారం

పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీలో నల్లి రాజారావు గతంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసే నేడు రిటైర్ అయి ప్రజలకు సేవ చేసేందుకు పాతపట్నం మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన భార్య రాష్ట్ర అధికార మహిళా ప్రతినిధిగా, సిహెచ్ చైర్మన్గా గతంలో పని చేశారు.

ఎన్నో ఏళ్లుగా పాతపట్నం ప్రజలకు వారి సేవలు అందించేందుకే పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ప్రజలకు తెలిపేందుకు ఇంటింటి ప్రచారం చేపట్టారు. నల్లి రాజారావు నాగవంశం సంగం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.

ఇలాంటి వ్యక్తి పాతపట్నంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉంటే అభివృద్ధి చెందుతుందని పాతపట్నం వాస్తవ్యులు ప్రజలు తెలుపుతున్నారు. అలాగే ఈరోజు జోరు వర్షంలో కూడా నరసింహ నగర్ అచ్యుతాపురం గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో ఆయన అభిమానులు ఆయనతో నడుస్తున్న సైన్యం సభ్యులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM