Palakonda: పాలకొండ నగర పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంట

Palakonda: స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో పాలకొండ నగర పంచాయతీ పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రథమ స్థానం సాధించింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 1 Oct 2026 4:57 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ నగర పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంట

పాలకొండ: స్వచ్ఛ ఆంధ్ర జిల్లా అవార్డ్స్ 2026 పార్వతీపురం మన్యం జిల్లా లో గల పార్వతిపురం మున్సిపాలిటీ సాలూరు మున్సిపాలిటీ మరియు పాలకొండ నగర పంచాయతీలలో బెస్ట్ మున్సిపల్ అవార్డు మన పాలకొండ నగర పంచాయతీకి వచ్చింది.

ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులలో భాగంగా స్వచ్ఛ వారియర్ క్యాటగిరీలో పాలకొండ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పడాల జనకు బెస్ట్ వర్కర్ అవార్డు లభించింది. స్వచ్ఛ దేవాలయాల కేటగిరీలో పాలకొండ నగర పంచాయతీలో గల శ్రీ కోట దుర్గ దేవస్థానం నకు ఈ అవార్డు లభించింది.

స్వచ్ఛ హాస్పిటల్ కేటగిరీలో పాలకొండ నగర పంచాయతీలో గల యు పి హెచ్ సి నేలమ్మ కాలనీ కు అవార్డు లభించింది స్వచ్ఛ గవర్నమెంట్ కార్యాలయాలకు గాను సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నకు అవార్డు లభించింది. స్వచ్ఛ ఇండస్ట్రీస్ అవార్డు మోబి క్వాలిటీ ఫైబర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాలకొండ వారికి లభించింది.

స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ అవార్డు రాజరాజేశ్వరి ఎస్ఎల్ఎఫ్ వారికి లభించింది. జిల్లాస్థాయి అవార్డులలో పాలకొండ నగర పంచాయతీకి పారిశుధ్య నిర్వహణలో ప్రథమ స్థానం లభించడం పట్ల కమిషనర్ పీవీ నూకరాజు గారు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వ్యాపారులందరూ సమిష్టి సహకారంతో ఈ అవార్డు లభించింది అన్నారు ప్రజలకు వ్యాపారస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA