Saravakota: అర్లిలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు.. పల్లి కృష్ణకు నీరాజనాలు

Saravakota: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అర్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పల్లి కృష్ణ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలికారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 29 Oct 2026 5:13 PM IST
Saravakota
X

Saravakota: అర్లిలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు.. పల్లి కృష్ణకు నీరాజనాలు

శ్రీకాకుళం జిల్లా: సారవకోట మండలం అర్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పల్లి కృష్ణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామస్థులు బ్రహ్మరథం పడుతూ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గ్రామాల్లో లభిస్తున్న స్పందనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM