Palasa: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Palasa: పలాస నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు.

B LOKANADHAM, PALASA
Published on: 8 Oct 2026 4:34 PM IST
Palasa
X

Palasa: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

పలాస: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలాస నియోజకవర్గ పరిధిలోని వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో PMMSY పథకం నిధులు రూ.1.32 కోట్లతో నిర్మించిన చేపల వేలం హాల్, చేపల ప్రాసెసింగ్ కేంద్రాన్ని , పెద్ద మురహరిపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీతో కలిసి ఆవిష్కరించారు. మందస మండలం హరిపురం రట్టి కూడలిలో SUDA నిధులు రూ.74 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు, హరిపురంలో రూ.2.50 కోట్ల SUDA నిధులతో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు.

మందస మండలం హరిపురంలో 2.50 కోట్ల ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సి.ఎస్.ఆర్ నిధులతో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్. దేవునల్తాడ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, ఆదాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

చేపల మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు మత్స్యకారులకు GPS, లైఫ్ జాకెట్లు, ఐస్ బాక్సులు, సోలార్ లైట్లు వంటి సదుపాయాలను మరింతగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మూలపేట పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీ మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ఎర్రన్న ఆశయాలను కొనసాగిస్తూ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, వలసలు వెళ్లే పరిస్థితి నుంచి మన ప్రాంతానికే పెట్టుబడులు వచ్చే దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. పేదల సంక్షేమం, ఇళ్లు, రోడ్లు, డ్రెయిన్లు, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA