Palakonda: పాలకొండ నగర పంచాయతీలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం
Palakonda: పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా పల్లా విజయనిర్మల, 28 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణం చేయించిన కమిషనర్ నూకరాజు; ఎమ్మెల్యే జయకృష్ణ హాజరు.
Palakonda: పాలకొండ నగర పంచాయతీలో కొలువుదీరిన కొత్త పాలకవర్గం
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ సంఘంలో కొత్త పాలకవర్గం కొలువుతీరింది. మునిసిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో అధ్యక్షతన, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమక్షంలో కమిషనర్ నూకరాజు అన్ని వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ముందుగా మునిసిపల్ చైర్‌పర్సన్గా శ్రీమతి పల్లా (జనసేన) ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 28 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పల్లా విజయనిర్మల మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, కౌన్సిలర్లకు, పాలకొండ పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పల్లా కొండబాబు మాట్లాడుతూ పాలకొండ పట్టణ సమగ్రాభివృద్ధే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పారదర్శకమైన పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా కలిసికట్టుగా పనిచేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.




