Palakonda: అర్ణబ్ తుఫానుపై పాలకొండ అధికారులు తీవ్ర అప్రమత్తం!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో అర్ణబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కమిషనర్ పి.వి. నూకరాజు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 27 Oct 2026 9:28 AM IST
Palakonda
X

Palakonda: అర్ణబ్ తుఫానుపై పాలకొండ అధికారులు తీవ్ర అప్రమత్తం!

Palakonda: అర్ణబ్ తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పాలకొండ నగర పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ శ్రీ పి.వి. నూకరాజు గారి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సెక్రటరీలు, ఇంజినీరింగ్ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్షపాతం, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులపై చెట్లు లేదా ఇతర అడ్డంకులు ఏర్పడే అవకాశాలు తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో వెంటనే స్పందించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు.

తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తారని నగర పంచాయతీ అధికారులు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA