Palakonda: పాలకొండలో వీధి దీపాలు వెలగక ప్రజల అవస్థలు!
Palakonda: పాలకొండ నగరపంచాయతీ జెట్టివారి వీధి సహా పలుచోట్ల వీధిదీపాలు వెలగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి లైట్లు వేయాలని కోరుతున్నారు.
Palakonda: పాలకొండలో వీధి దీపాలు వెలగక ప్రజల అవస్థలు!
Palakonda: పాలకొండ నగరపంచాయితీ పరిధిలోని జెట్టివారి వీధిలో గడిచిన వారం రోజులుగా వీధి దీపాలు వెలగక వీధివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కు మెయిన్ రోడ్ కు అనుసంధానంగా ఉన్న వీధి కనుక రద్దీ ఎక్కువగా ఉంటుంది దీనితో చీకటిలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నగరపంచాయితీ కమీషనర్ గారు మా వీధిలోని సమస్యను గుర్తించి వీలైనంత తొందరగా తమ సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఈ పరిస్థితి మా ఒక్క వీధిలోనే కాకుండా పాలకొండలోని చాలా వీదులలో ఉంది కావున ఈ సమస్యపై దృష్టి సారించి గతంలో చెత్తపై మీరు చేసినట్టుగా వీధిదీపాలపైకూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి పాలకొండలోని వీదులకు స్ట్రీట్ లైట్స్ వచ్చేలా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాము.




