Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ముగిసిన హుండీ లెక్కింపు!

Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ. 14,37,855 నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు వచ్చినట్లు ఈఓ సూర్యనారాయణ తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Oct 2026 8:39 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ముగిసిన హుండీ లెక్కింపు!

Palakonda: నగర పంచాయతీ పరిధిలోని శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు లో 14,37, 855 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణధికారి వివి సూర్యనారాయణ తెలిపారు. శ్రీ కోట దుర్గ అమ్మ వారి ఆలయంలో ఏర్పాటు చేసిన 8 శాశ్వత హుండీలు, 9 తాత్కాలిక హుండీలు కలిపి మొత్తం 17 హుండీలను తెరిచి లెక్కించగా రూ.14,37,855 నగదు ఆదాయం లభించింది.

అదనంగా బంగారం, వెండి కానుకలు కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన 8 శాశ్వత హుండీలు, 9 తాత్కాలిక హుండీలు కలిపి మొత్తం 17 హుండీలను తెరిచి లెక్కించగా రూ.14,37,855 నగదు ఆదాయం లభించింది. అదనంగా 8 గ్రాముల మిక్సీడ్ బంగారం,17 గ్రాముల మిక్సీడ్ వెండి కానుకలు వచ్చిందన్నారు.

పాలకొండ తనిఖీదారు ఎస్. రామారావు, గ్రూప్ టెంపుల్స్-॥ కార్యనిర్వహణాధికారి కె. పరమేశ్వరి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రూప్ దేవాలయాల సిబ్బంది, ఏపీజీ బ్యాంకు ప్రతినిధులు, పాలకొండ, కురుపాం, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన సేవకులు, పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA