Palakonda: 48 ఏళ్లుగా కొనసాగుతున్న మట్టి గణపతి ప్రత్యేక ఆచారం

Palakonda: పాలకొండ యాలం కూడలిలో 48 ఏళ్లుగా మట్టి గణపతిని ప్రతిష్టిస్తూ పర్యావరణ పరిరక్షణకు చాటుతున్న పల్లా కొండబాబు. ప్రత్యేక ఆకర్షణగా జగన్నాథుని రూపం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 16 Sept 2026 11:50 PM IST
Palakonda
X

Palakonda: 48 ఏళ్లుగా కొనసాగుతున్న మట్టి గణపతి ప్రత్యేక ఆచారం

పాలకొండ: ఉమ్మడి జిల్లా పాలకొండ పట్టణంలోని యాలం కూడలి వద్ద 48 ఏళ్లుగా పల్లా కొండబాబు ఆధ్వర్యంలో మట్టిగణపతి మండపం ఏర్పాటుచేయడం ఆనవాయితీ. ప్రస్తుతం భారీ గణేషులను ఏర్పాటు చేయడం ఒక స్టేటస్ సింబల్ లా భావిస్తున్న తరుణంలో చాలా ఏళ్లకు పూర్వమే యాలం కూడలి వద్ద భారీ విగ్రహాలను ఏర్పాటుచేసేవారు.

అక్కడ విగ్రహాన్ని చూడటానికి నవరాత్రులలో ఏదో ఒకసారైనా చుట్టు పక్కల గ్రామాలప్రజలు పాలకొండ వచ్చేవారంటే ఈ మండపంలోని విగ్రహం ప్రాధాన్యత అర్ధమవుతుంది.

పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కేవలం మట్టి గణేష్షుడ్ని ఏర్పాటుచేయడమే కాకుండా అంతరించిపోతున్న కళలకు కొత్తజీవం పొసేలా సవర నృత్యాలు సాముగరిడీలు బళ్లవేషాలతో వినాయకుని నిమ్మజ్జనం మరింత ప్రత్యేకత పాలకొండ పట్టణమంతా ఊరేగింపుగా చేసే నిమ్మజ్జనం కోసం యావత్ ప్రజానీకం ఎదురుచూస్తూ ఉంటుంది.

34 వ ఏడాది అయిన ఈ సంవత్సరం పల్లా కొండబాబు ఆలోచన మేరకు జగన్నాధుని తోడుగా ప్రతిష్టించిన గణేషుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.. పల్లా కొండబాబు, విజయనిర్మల దంపతుల చేతులమీదుగా ప్రాణప్రతిష్ట జరిగిన గణపయ్య నిత్యపూజలు అందుకుంటూ పాలకొండ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA