Srikakulam: ఇచ్చాపురం నియోజకవర్గంలో ఊపందుకున్న చేరికలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రామయ్యపుట్టుగకు చెందిన 50 మంది వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో టీడీపీలో చేరారు.
Srikakulam: ఇచ్చాపురం నియోజకవర్గంలో ఊపందుకున్న చేరికలు!
Srikakulam: కవిటి మండలం రామయ్యపుట్టుగలో వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు క్యాంపు కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ సమక్షంలో పాండవ రామారావు, పాండవ చంద్రశేఖర్‌తో పాటు సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ చేరికతో రామయ్యపుట్టుగ ప్రాంతంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీలో చేరిన వారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ జెడ్పీటీసీ బెందాళం రమేష్, మాజీ సర్పంచ్ మధుబాబు, పూడి ప్రవీణ్, సిపాన రమణమూర్తి, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, బార్ల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.




