Kanchili: కొల్లూరులో హోరెత్తిన కూటమి ప్రచారం: అభ్యర్థుల జోరు
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొల్లూరులో కూటమి అభ్యర్థులు పైల శారద, మద్దిల ఆనంద్, విమల ఇంటింటికీ తిరుగుతూ ముమ్మర ఎన్నికల ప్రచారం చేపట్టారు.
Kanchili: కొల్లూరులో హోరెత్తిన కూటమి ప్రచారం: అభ్యర్థుల జోరు
కంచిలి: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఆదివారం హోరెత్తింది. ఎంపీటీసీ అభ్యర్థి పైల శారద, జడ్పీటీసీ అభ్యర్థి మద్దిల ఆనంద్, ఎంపీపీ అభ్యర్థి విమల ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం చేపట్టారు. పంచాయతీలోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి విమల మాట్లాడుతూ... "కంచిలి మండల అభివృద్ధే మా లక్ష్యం. ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మహిళల సంక్షేమం, చదువుకు ప్రాధాన్యం ఇస్తాం. కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చూస్తాం" అని అన్నారు.
జడ్పీటీసీ అభ్యర్థి మద్దిల ఆనంద్ మాట్లాడుతూ... "జిల్లా పరిషత్ నుంచి కొల్లూరు పంచాయతీతో పాటు మండలంలోని ప్రతి గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. రైతులకు, యువతకు అండగా ఉంటా" అని హామీ ఇచ్చారు.
ఎంపీటీసీ అభ్యర్థి పైల శారద మాట్లాడుతూ... "కొల్లూరు పంచాయతీ ప్రజలే నా బలం. మీ ఆశీస్సులతో గెలిస్తే పంచాయతీలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తా. ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తా" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షులు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ప్రదీప్, భగీరథి, మణితో పాటు యువత, మహిళలు, ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




