Narasannapeta: లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
Narasannapeta: నరసన్నపేటలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 73,389 చెక్కును లబ్ధిదారుడు రామకృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే తన గృహంలో అందజేశారు.
Narasannapeta: లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
నరసన్నపేట: నరసన్నపేట పట్టణం, వంశధార నగర్ కాలనీ చెందిన ఊన్న రామకృష్ణ అనారోగ్యానికి గురై, వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన 73389/- (డెభ్భై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు) చెక్కును మబగాం ఎమ్మెల్యే గారి సృగృహంలో లబ్ధిదారునికి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలై ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ నిధి ఒక సంజీవనిలా పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దీనిని వర్తింపజేసేలా తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమకు సకాలంలో చెక్కు అందేలా సహకరించినందుకు ఊన్న రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షులు బతకల సంతోషి గారు, జిల్లా తెలుగు నాడు ఫెడరేషన్ అధ్యక్షులు బలగ ప్రహర్ష గారు, మండల కార్యదర్శి బతకల గోపి గారు ,టీడీపీ సీనియర్ నాయకులు దంత త్రినాథ గారు ,కుటుగుమడి కృష్ణ పట్నాయక్ గారు,గుడ్ల వెంకట రమణ గారు, చౌదరి కాంతారావు గారు ,నిమ్మాడ వసంత గారు, ఇంజరపు శ్రీను గారు, పొట్నూరు సుమన్ గారు,సాహుకారి ఉదయ కుమార్ గారు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




