Palakonda: నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పరిశీలన

Palakonda: నాగావళి నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరిక.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Sept 2026 7:09 PM IST
Palakonda
X

Palakonda: నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పరిశీలన

పాలకొండ: నాగావళి నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలను సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, IAS గారు పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, గ్రామ ప్రజలు నదిలో స్నానాలు చేయడం, ఇతర అవసరాల కోసం నదిలోకి దిగడం పూర్తిగా నివారించాలని సబ్ కలెక్టర్ గారు సూచించారు.

అదేవిధంగా, నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది నాగావళి నది నీటి ప్రవాహ పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత — ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలి.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA