Palakonda: పాలకొండలో నూతన అగ్నిమాపక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జయకృష్ణ!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రూ.1.35 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక భవనాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 28 Sept 2026 1:40 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో నూతన అగ్నిమాపక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జయకృష్ణ!

Palakonda: పాలకొండలో కోటి 35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అగ్నిమాపక భవనాన్ని స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. 1983 లో ఏర్పాటైన పాలకొండ అగ్నిమాపక కేంద్రం గతంలో శిదిలమైన భవనంలో కార్యకలాపాలు నిర్వహించేవారు అది కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో గుడారాలలో సైతం తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నూతన శాశ్వతభవనానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పటైన వెంటనే నిధులు మంజూరు చేసి 2025 లో శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తిచేసి నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ పాలకొండ అగ్నిమాపక సిబ్బంది చుట్టు పక్కల అనేక మండలాలలో ఏ అవసరమోచ్చిన వెంటనే అక్కడకు చేరుకొని ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా కాపాడేవారని, అటువంటి సిబ్బంది కనీసం ఒక బిల్డింగ్ లేక చాలా అవస్థలుపడ్డారని గుర్తు చేసారు. ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఈ భవనాన్ని నిర్మించామని అన్నారు. తన చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం భవనం ప్రారంభం జరగడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA