Pathapatnam: పాతపట్నంలో కూటమి విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే గోవిందరావు!

Pathapatnam: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావును సుడా చైర్మన్ రవికుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి భవాని కలిసి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 28 Oct 2026 6:25 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో కూటమి విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే గోవిందరావు!

Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావుని SUDA చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, ఎల్.ఎన్.పేట మండల ఎన్డీఏ కూటమి ZPTC అభ్యర్థిని కొరికాన భవాని మర్యాదపూర్వకంగా కలిశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే మావిడి గోవిందు సూచించారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM