Srikakulam: ఆమదాలవలసలో మత్స్యకారులకు 50 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తుఫాన్ ప్రభావిత 130 మత్స్యకార కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి 50 కేజీల ఉచిత బియ్యం అందజేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 1 Oct 2026 12:53 PM IST
Srikakulam
X

Srikakulam: ఆమదాలవలసలో మత్స్యకారులకు 50 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Srikakulam: తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, సముద్రంలో అలజడి కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో ఉన్న మత్స్యకారులు ఆ సమయంలో ఐదు రోజులపాటు వేటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా నిలిచిందని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆమదాలవలస నియోజకవర్గంలో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించారు. ఇందులో భాగంగా ఆమదాలవలస పట్టణంలోని 18వ వార్డు కండ్రపేట వీధిలో 130 మత్స్యకార కుటుంబాలను గుర్తించి, ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే కూన రవికుమార్ స్వయంగా మత్స్యకారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యాన్ని అందజేసి, వారి కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మత్స్యకార కుటుంబాలు ఎమ్మెల్యేకు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కష్టకాలంలో వారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మత్స్యకార కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.