Palasa: రూ. 7.80 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Palasa: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో రూ.7.80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష. అధికారులకు తగు సూచనలు.
Palasa: రూ. 7.80 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Palasa: పలాస నియోజకవర్గం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఎరుకుల సత్యారావు బిల్డింగ్ వద్ద రూ.7 లక్షల 80 వేల నిధులతో నిర్మించనున్న నూతన CC రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు పాల్గొని నూతన CC రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని, పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నూతన రోడ్ నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో గల కూటమి ముఖ్య నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు వారి సిబ్బంది,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




