Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా మహాకవి గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతులు!

Parvathipuram: పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతుల వేడుకలు. చిత్రపటాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Sept 2026 3:06 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా మహాకవి గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతులు!

Parvathipuram: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పాల్గొని, మహాకవి గుర్రం జాషువా మరియు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ, మహాకవి గుర్రం జాషువా గారు తన అపారమైన జ్ఞాన సంపదతో సమాజానికి, ప్రపంచానికి ఎంతో విలువైన సందేశాన్ని అందించారని కొనియాడారు. ఆయన కాలం చేసి ఇన్నేళ్లవుతున్నా, సమాజంలో దేవుడికే లేని వివక్షను , మనుషులకు మాత్రం ఎందుకని ప్రశ్నిస్తూ ఆయన రాసిన ‘గబ్బిలం’ వంటి రచనలు మరియు పద్యాలు నేటికీ చిరస్మరణీయంగా నిలిచాయని తెలిపారు. ఆయనకు లభించిన అవార్డులకే ఆయన వల్ల గొప్ప గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు.

అనంతరం భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ, కేవలం 23 ఏళ్ల చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారని తెలిపారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో యావత్ భారతదేశ యువతను, పశ్చిమ బెంగాల్ నుండి బర్మా వరకు ప్రతీ ప్రాంతాన్నీ రగిలించి స్వాతంత్ర్య పోరాటంలో నడిపించారని గుర్తుచేశారు. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికే సింహస్వప్నంగా మారి, మోకాళ్లపై బతకడం కంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడమే మేలని వీరమరణం పొందిన గొప్ప దేశభక్తుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు విశేషంగా పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)