Santabommali: నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన పరిహారం అందజేస్తామని ప్రభుత్వ హామీ!

Santabommali: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు.. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా.

RAMBABU, TEKKALI
Published on: 25 Sept 2026 1:56 PM IST
Santabommali
X

Santabommali: నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన పరిహారం అందజేస్తామని ప్రభుత్వ హామీ!

Santabommali: సంతబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన, ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి విస్తృత పర్యటన. వడ్డీవాడ, అంట్లవరం, వడ్డీతాండ్రా, సంతబొమ్మాళిలో ముంపు ప్రాంతాల పరిశీలన. ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి.

రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు తెలుసుకున్న అచ్చెన్నాయుడు. దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశం. ముంపునకు గురైన పంట పొలాలను గుర్తించి నష్ట వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం.

క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచన, గోదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మారువాడ, మేఘవరం వరకు ముంపు ప్రాంతాల పరిశీలన. రహదారులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు. ముంపుకు గురైన వడ్డీవాడ, అంట్లవరం, వడ్డీతాండ్రా, సంతబొమ్మాళిలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు మరియు దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

రహదారులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన పంట పొలాలను గుర్తించి నష్ట వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో కూడా పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచనలు అందించారు. గోదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మారువాడ, మేఘవరం వరకు ముంపు ప్రాంతాలను కూడా పరిశీలించారు. పంట నష్టానికి తగ్గట్టు వారికి తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు,

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI