Palakonda: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కేడర్ సిద్ధం కావాలి

Palakonda: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కేడర్ సిద్ధం కావాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. పాలకొండలో నాయకులతో సమావేశం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 29 Sept 2026 7:54 PM IST
Palakonda
X

Palakonda: స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కేడర్ సిద్ధం కావాలి

పాలకొండ: రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా సిద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. సీతంపేట ఐటీడీఏలో జరగనున్న గవర్నింగ్ బాడీ సమావేశానికి వెళ్తూ పాలకొండలో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు జరుగుతోందని అన్నారు.

రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ అరకు పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు మోజోరు తేజవతి, తదితరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA