Srikakulam: అచ్చెన్నాయుడు సమక్షంలో భారీగా టీడీపీలో చేరిన వైకాపా నాయకులు!
Srikakulam: మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరిన చిట్టివలస వైకాపా నాయకులు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడి.
Srikakulam: అచ్చెన్నాయుడు సమక్షంలో భారీగా టీడీపీలో చేరిన వైకాపా నాయకులు!
Srikakulam: వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో
కోటబొమ్మాళి మండలం చిట్టివలస పంచాయతీ చవితిపేట గ్రామానికి చెందిన 60 మంది వైకాపా నాయకులు అంపోలుపాపారావు, రామినాయుడు, కృష్ణమూర్తి, కె. బయన్నకూర్మారావు, హనుమంతు సత్యం, మామిడి కృష్ణ పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ ఐదేళ్లలో గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో పాలన ప్రారంభించామని, ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. గతంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
వచ్చే వారం, పది రోజుల్లో గ్రామానికి వస్తా “వచ్చే వారం, పది రోజుల్లో మీ గ్రామానికి స్వయంగా వస్తాను. గ్రామమంతా తిరిగి ప్రజలను కలుసుకుని, స్థానికంగా ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తెలుసుకుంటాను. రాబోయే ఆరు నుంచి ఏడు నెలల్లో గ్రామంలో మంచి వాటర్ ట్యాంక్ నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ తాగునీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాను” అని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, అధికారం ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండకూడదని మంత్రి అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.ధర్మం, న్యాయం కోసం అందరూ అండగా నిలవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




