Kanchili: కంచిలి ఎంపీపీ, జడ్పీటీసీకి మంత్రి అచ్చెన్నాయుడు ఘన సన్మానం!

Kanchili: కంచిలి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీపీ మాదిన రామారావు, జడ్పీటీసీ మద్దిల ఆనంద్‌లను నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఘనంగా సత్కరించారు.

G.RAMBABU, SOMPET
Published on: 19 Nov 2026 8:07 AM IST
Kanchili
X

Kanchili: కంచిలి ఎంపీపీ, జడ్పీటీసీకి మంత్రి అచ్చెన్నాయుడు ఘన సన్మానం!

Kanchili: కంచిలి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కంచిలి మండల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక గౌరవం కల్పించారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కంచిలి ఎంపీపీ మాదిన రామారావు, జడ్పీటీసీ మద్దిల ఆనంద్‌లను శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఎంపీపీ, జడ్పీటీసీ సమన్వయంతో వ్యవహరిస్తూ కంచిలి మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. మంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకోవడంతో కంచిలి మండల కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET