Srikakulam: గిన్నిస్ రికార్డు సాధించిన లలితారాణికి మంత్రి సన్మానం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత చల్లా లలితారాణిని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 8 Oct 2026 11:26 AM IST
Srikakulam
X

Srikakulam: గిన్నిస్ రికార్డు సాధించిన లలితారాణికి మంత్రి సన్మానం!

Srikakulam: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి శ్రీకాకుళం జిల్లాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన శ్రీమతి చల్లా లలితారాణిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బృంద సభ్యుల సమష్టి కృషితో క్రోషే (ఊలు)తో 12.18 కిలోమీటర్ల పొడవైన భారత జాతీయ జెండాలను అల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన లలితారాణిని మంత్రి అభినందించారు. ఈ ఘనతతో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చినందుకు ఆమెను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లలితారాణి భర్త, ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా నాయకులు బస్వా భాస్కర్‌ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు బొత్స శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి బారకల నవీన్, తామరపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.