Srikakulam: దుప్పిలపాడులో 'ప్రజా సేవలో 2.0' పింఛన్ల పంపిణీ..మంత్రి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. రూ.101.80 లక్షలతో అభివృద్ధి పనులు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 1 Oct 2026 4:03 PM IST
Srikakulam
X

Srikakulam: దుప్పిలపాడులో 'ప్రజా సేవలో 2.0' పింఛన్ల పంపిణీ..మంత్రి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడు గ్రామంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్థులు, లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

తొలుత ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను శంకుస్ధాన ప్రారంభోత్స‌వం చేశారు, కోట‌బొమ్మాళి మండ‌లం గంగువాడ: రూ.47 లక్షలతో 5 అంతర్గత సిమెంట్‌ రోడ్లు ప్రారంభించారు, దుప్పిలపాడు: రూ.38.80 లక్షలతో రక్షిత మంచినీటి పథకం శంకుస్ధాప‌న చేశారు, ,దుప్పిలపాడు: రూ.16 లక్షలతో అంతర్గత సిమెంట్‌ రోడ్లు ప్రారంభించారు,

అవ్వాతాతల పింఛను రూ.4,000కు పెంపు ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పింఛనును రూ.4,000కు పెంచామని అచ్చెన్నాయుడు తెలిపారు. వికలాంగులకు గతంలో ఉన్న రూ.6,000 పింఛనును రూ.15,000 వరకు పెంచి వారికి కొండంత అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వచ్చిన 17 లక్షల పింఛను దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని చెప్పారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.