Srikakulam: నిమ్మాడ యువకుడు ప్రతిభ అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధన
Srikakulam: నీట్ పీజీలో అఖిల భారత స్థాయిలో 5,574వ ర్యాంకు సాధించిన నిమ్మాడ గ్రామానికి చెందిన సునీల్ బాబాను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు.
Srikakulam: నిమ్మాడ యువకుడు ప్రతిభ అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధన
Srikakulam: నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 5,574వ ర్యాంకు సాధించిన నిమ్మాడ గ్రామానికి చెందిన సునీల్ బాబా, ఆయన తండ్రి ఎస్. శ్రీనివాసరావును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు.
శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సునీల్ బాబా, ఆయన తల్లిదండ్రులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థిని అభినందించి, భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
కుమారుడి విజయానికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ప్రశంసనీయమన్నారు. సునీల్ బాబా సాధించిన ర్యాంకుతో నిమ్మాడ గ్రామానికి, కోటబొమ్మాళి మండలానికి మంచి పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు.




