Meliaputti: హీరాపురం-రాయికోల రోడ్డు మరమ్మతులు చేపట్టాలి: ఆదినాయుడు
Meliaputti: మెళియాపుట్టి మండలం హీరాపురం–రాయికోల 5 కి.మీ బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని మాజీ వైస్ ఎంపీపీ ఆదినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Meliaputti: హీరాపురం-రాయికోల రోడ్డు మరమ్మతులు చేపట్టాలి: ఆదినాయుడు
Meliaputti: మెళియాపుట్టి మండలం పరశురాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని హీరాపురం నుంచి రాయికోల గ్రామం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో 108, 104 అంబులెన్స్ వాహనాలు, గర్భిణులు, బాలింతలు మరియు తల్లి–బిడ్డల కోసం వచ్చే వాహనాలు గ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
రహదారి దుస్థితి కారణంగా అత్యవసర వైద్య సేవలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని మాజీ వైస్ ఎంపీపీ సవర ఆదినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించి, అత్యవసర ప్రాతిపదికన మరమ్మతులకు నిధులు మంజూరు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెంబూరు ప్రసాద రావు, వెంకటేష్, వెంకన్న, గిరిబాబు, విశాఖ రావు, మోహన్ రావు, ధనుంజయ, దేవా ఉన్నారు.




