Ichchapuram: ఇచ్ఛాపురంలో భారీ అగ్నిప్రమాదం ప్లాస్టిక్ గోదాము పూర్తిగా దగ్ధం!
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న దుకాణానికి వ్యాపించడంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.
Ichchapuram: ఇచ్ఛాపురంలో భారీ అగ్నిప్రమాదం ప్లాస్టిక్ గోదాము పూర్తిగా దగ్ధం!
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణంలో బుధవారం తెల్లవారి జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దాసన్నపేటలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రామకృష్ణ ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు గోదాము అంతటా వ్యాపించి తీవ్రస్థాయికి చేరాయి.
ఈ ప్రమాదంలో గోదాములోని సరుకు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. గోదాము నుండి భారీగా మంటలు ఎగసిపడటంతో పాటు పక్కనే ఉన్న ‘మేఘన లేడీస్ కార్నర్’ షాపుకు సైతం మంటలు వ్యాపించడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే గోదాములోని వస్తువులు చాలావరకు కాలి బూడిదయ్యాయి అలానే మేఘన లేడీస్ కార్నర్ లో కూడా మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. అనంతరం ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన పూర్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.




