Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ టీడీపీలోకి మాజీ కౌన్సిలర్లు!
Ichchapuram: ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీకి భారీ షాక్ తగిలింది. ముగ్గురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
Ichchapuram: ఇచ్చాపురం మున్సిపాలిటీలో వైసీపీకి షాక్ టీడీపీలోకి మాజీ కౌన్సిలర్లు!
Ichchapuram: మున్సిపల్ ఎన్నికల వేళ ఇచ్చాపురం పట్టణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నగారా మోగిన తొలి నాళ్లలోనే అధికార వైసీపీకి ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక పురపాలక సంఘంలో గట్టి పట్టున్న సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్స్ ఒకేసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూటికి చేరడంతో పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
టీడీపీలోకి వలసల జోరు.. కుదేలవుతున్న వైసీపీ క్యాడర్ప ట్టణ రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని ప్రాబల్యం కలిగిన ముగ్గురు కీలక నేతల కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి.
గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా వ్యవహరించి, వరుసగా 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై ప్రజాదరణ పొందిన సీనియర్ నాయకుడు బి. ఆనంద్. పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ గా , రెండు పర్యాయాలు కౌన్సిలర్గా విజయం సాధించిన రెయ్యి నారాయణ. పట్టణంలో బలమైన క్యాడర్ కలిగిన మాజీ కౌన్సిలర్ పి.వి. ప్రసాద్ కుటుంబం (రెండుసార్లు కౌన్సిలర్లుగా గెలిచిన నేపథ్యం).
సుదీర్ఘ కాలం పాటు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసి, వార్డు స్థాయిల్లో పటిష్టమైన అనుచరగణం కలిగిన ఈ సీనియర్లు ఒకేసారి పార్టీ మారడం వైసీపీ స్థానిక నాయకత్వానికి మింగుడుపడటం లేదు. అసలు ఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే ఈ స్థాయి వలసలు చోటుచేసుకోవడం విపక్ష వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది.
దూసుకుపోతున్న ఆశి లీలా రాణి.. మరింత బలపడిన టీడీపీ
మరోవైపు టీడీపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆశి లీలా రాణి క్షేత్రస్థాయిలో మెరుపు వేగంతో దూసుకుపోతున్నారు. తాజా చేరికలతో ఆమె విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ల అనుభవం, లీలా రాణి దూకుడు తోడవడంతో ఇచ్చాపురం మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగరేయడం ఖాయమనే ధీమాను టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల పోరు ప్రారంభానికి ముందే ప్రధాన వికెట్లు పడిపోవడంతో ఇచ్చాపురంలో వైసీపీ పట్టు నిలుపుకోవడం పెను సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.




