Pathapatnam: కాజ్వే మునిగిపోవడంతో పాతపట్నంలో నిలిచిన రాకపోకలు!
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్రతనయ నదీ కాజ్వే మునిగిపోవడంతో రెండు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
Pathapatnam: కాజ్వే మునిగిపోవడంతో పాతపట్నంలో నిలిచిన రాకపోకలు!
Pathapatnam: పాతపట్నం మహేంద్రతనయ నదీ కాజ్వే వద్ద పాతపట్నం సర్కిల్ పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం గ్రామాల ప్రజలు, కాజ్వే మీదగా ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిని అప్రమత్తంగా ఉంచేందుకు పాతపట్నం సిఐ కె.వెంకటరావు, ఎస్ఐ కె.మధుసూదనరావు ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను, స్టాపర్లను ఏర్పాటు చేశారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు కాజ్వే దాటడం ప్రమాదకరమని, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సిఐ వెంకటరావు తెలిపారు. ముఖ్యంగా వరద ఉధృతి పెరిగితే కాజ్ వే పై వాహన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులు సూచనలను పాటించాలని వారు ప్రజలను తెలిపారు.




