Kanchili: కంచిలి: బూరగాం సర్పంచ్ అభ్యర్థిగా మడ్డు అభి నామినేషన్!
Kanchili: కంచిలి మండలం బూరగాం సర్పంచ్ అభ్యర్థిగా మడ్డు అభి మంగళవారం జలంత్రకోట సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు.
Kanchili: కంచిలి: బూరగాం సర్పంచ్ అభ్యర్థిగా మడ్డు అభి నామినేషన్!
కంచిలి: కంచిలి మండలం బురగాం పంచాయతీ ఎన్నికల్లో సందడి మొదలైంది. సర్పంచ్ బరిలో మడ్డు అభి నిలిచారు. మంగళవారం తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసి జలంత్రకోట సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా గ్రామంలో భారీ సందడి నెలకొంది.
మడ్డు అభికి మద్దతుగా సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పైల దేవదాస్ రెడ్డి, అభిమానులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యువత, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బురగాం గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని మడ్డు అభి అని తెలిపారు. గ్రామంలోని మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. అందరినీ కలుపుకొని, కులమతాలకు అతీతంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.




