Pathapatnam: పాతపట్నం కుమ్మరి వీధిలో ఘనంగా ముగిసిన విఘ్నేశ్వర ఉత్సవాలు!
Pathapatnam: పాతపట్నం కుమ్మరి వీధిలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. రూ.39,000లకు స్వామివారి లడ్డూను దక్కించుకున్న లక్కోజు మాధవరావు - హేమలత దంపతులు.
Pathapatnam: పాతపట్నం కుమ్మరి వీధిలో ఘనంగా ముగిసిన విఘ్నేశ్వర ఉత్సవాలు!
Pathapatnam: పాతపట్నం లో కుమ్మరి వీధిలో విఘ్నేశ్వర ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయి. ప్రతిష్ఠాపన నుండి నిత్య పూజలు అందుకున్న స్వామివారికి ముగింపు వేడుకగా నిర్వహించిన లడ్డూ వేలం పాట ప్రజల ఉత్సాహం నడుమ ఘనంగా జరిగింది.
గత ఏడాది లడ్డూను వేలంలో దక్కించుకున్న లక్కోజు మాధవరావు - హేమలత దంపతులు, ఈ ఏడాది కూడా పోటీపడి రూ. 39,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలు తమపై ఉండడం వల్లే వరుసగా రెండో ఏడు కూడా ఈ అవకాశం దక్కిందని ఈ సందర్భంగా దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను దక్కించుకున్న లక్కోజు మాధవరావు హేమలత దంపతులను, అలాగే స్వామివారి విగ్రహ దాతలైన చింటూ పండ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆ లంబోదరుని ఆశీస్సులు కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సత్కార కార్యక్రమం అనంతరం భక్తుల జయ జయధ్వానాలు, డప్పు వాయిద్యాల నడుమ విఘ్నేశ్వర నిమజ్జన శోభాయాత్రను వైభవంగా నిర్వహించి నిమజ్జనం పూర్తి చేశారు.




