Kothuru: కురిగాం పంచాయతీలో ఎస్ఐ వెంకటేష్ పల్లె నిద్ర
Kothuru: కొత్తూరు మండలం కురిగాం పంచాయతీలో ఎస్ఐ వెంకటేష్ పల్లె నిద్ర నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీసి, యువతకు పిలుపునిచ్చారు.
Kothuru: కురిగాం పంచాయతీలో ఎస్ఐ వెంకటేష్ పల్లె నిద్ర
కొత్తూరు: కొత్తూరు మండలంలోని కురిగాం గ్రామ పంచాయతీలో కొత్తూరు ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.
గ్రామానికి విచ్చేసిన ఎస్ఐ గారికి కొత్తూరు మండల ఐ-టీడీపీ నాయకులు శేపాన విక్రమ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ఐ-టీడీపీ అధ్యక్షులు శేపాన విక్రమ్, పోతల నీలమణి, పోతల గిరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




