meliaputti: కొసమాలలో కూటమి భారీ ర్యాలీ ఎంపీటీసీ అభ్యర్థి సలాన కృష్ణవేణి

meliaputti: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాలలో ఎన్‌డీఏ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి సలాన కృష్ణవేణి భారీ ప్రచార ర్యాలీ. జనసంద్రాన్ని తలపించిన ప్రచారం.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 2 Nov 2026 5:39 PM IST
meliaputti
X

meliaputti: కొసమాలలో కూటమి భారీ ర్యాలీ ఎంపీటీసీ అభ్యర్థి సలాన కృష్ణవేణి

మెళియాపుట్టి: స్థానిక MPTC ఎన్నికల ప్రచారంలో భాగంగా కొసమాల గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. కూటమి ఉమ్మడి MPTC అభ్యర్థి సలాన కృష్ణవేణి విజయాన్ని ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమంలో త్రిపక్ష కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి ఊరూ వాడా ఏకమై ఘన స్వాగతం పలికారు. ప్రచార రథం ముందర మహిళలు మంగళహారతులతో, పూల వర్షంతో సలాన కృష్ణవేణికి ఆత్మీయ ఆహ్వానం పలికారు. జనసేన జెండాలు, కూటమి నాయకుల నినాదాలతో కొసమాల గ్రామం మార్మోగింది.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ — కూటమి పాలనలోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కొసమాల సెగ్మెంట్ ఎంపిటిసి స్థానంలో పోటీ చేస్తున్న సలాన కృష్ణవేణిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, గ్రామ సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అభ్యర్థి సలాన కృష్ణవేణి మాట్లాడుతూ — "గ్రామ ప్రజలు చూపుతున్న అభిమానం, అందిస్తున్న ఆశీస్సులు మరువలేనివి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొసమాల గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను" అని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM