Kanchili: కంచిలి సర్పంచ్ అభ్యర్థిగా కొర్రయి కురయ్య పేరు ఖరారు!

Kanchili: కంచిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొర్రయి కురయ్య పేరును ఎంపీపీ మాదిన విమల రామారావు ఆధ్వర్యంలో మండల టీడీపీ నేతలు ఖరారు చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 14 Nov 2026 6:34 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి సర్పంచ్ అభ్యర్థిగా కొర్రయి కురయ్య పేరు ఖరారు!

కంచిలి: కంచిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొర్రయి కురయ్య పేరును మండల టీడీపీ నేతలు ఖరారు చేశారు. ఎంపీపీ మాదిన విమల రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కురయ్య మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో తనను గెలిపించాలని, తనకు కేటాయించిన గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి కురయ్య విజయానికి కృషి చేయాలని ఎంపీపీ విమల రామారావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మద్దిల ఆనంద్, జగదీష్ పట్నాయక్, కొత్తకోట శేఖర్, మద్దిల కేశవయ్య తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET