Rajam: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లే లక్ష్యం!
Rajam: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వెల్లడించారు.
Rajam: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లే లక్ష్యం!
Rajam: బీసీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎన్టీఆర్ హయాంలో 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, అనంతరం చంద్రబాబు హయాంలో వాటిని 34 శాతానికి పెంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని కోండ్రు మురళీమోహన్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను ఆమోదించి, నిబంధనలకు లోబడి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు 24.60 శాతం, జెడ్పీ చైర్‌పర్సన్‌కు 23.08 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
బీసీలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్బీ సీల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




