Kaviti: జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో కళ్యాణి విద్యార్థుల ప్రతిభ
Kaviti: జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో కవిటి కళ్యాణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. దుద్ది సహస్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Kaviti: జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో కళ్యాణి విద్యార్థుల ప్రతిభ
కవిటి: కవిటి జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో కవిటి మండలానికి చెందిన కళ్యాణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. టెక్కలిలోని ఆల్ఫాజన్ పాఠశాల వద్ద ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 13 ఏళ్ల వయసు విభాగంలో పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు.
ఐదో తరగతి చదువుతున్న దుద్ది సహస్ర జిల్లా స్థాయిలో ఐదో ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అలాగే బెందారం ఆశ్రిత, సిద్ధార్థ, వర్ణిక ప్రతిభ కనబరిచి రాజాంలో జరగనున్న తదుపరి స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
జిల్లా చదరంగం కార్యదర్శి సనపల భీమారావు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల కరస్పాండెంట్ ఎల్. రాజేష్, ప్రిన్సిపాల్ బిందు మాధవి, పరిపాలనాధికారి రాణితో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.




