Kanchili: కంచిలి మండలం ముండ్ల ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ ముమ్మర ప్రచారం!
Kanchili: కంచిలి మండలం ముండ్ల ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విస్తృత ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని నాయకుల విజ్ఞప్తి.
Kanchili: కంచిలి మండలం ముండ్ల ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ ముమ్మర ప్రచారం!
Kanchili: కంచిలి ముండ్ల ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షీ, జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావు, మాజీ ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముండ్ల ఎంపీటీసీ మహిళా అభ్యర్థి మంజు ప్రధాన్‌తో పాటు జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావుకు, ఎంపీపీ పైల హిమావతి దేవదాస్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం సాగిస్తూ ఓటర్ల మద్దతు కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ మండల ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




