Kanchili: అనాథాశ్రమానికి తాగునీటి సౌకర్యం కల్పించిన మాదిన రామారావు

Kanchili: కంచిలి మండలం పుడభద్ర అనాథాశ్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు రూ.2.50 లక్షల నిధులతో తాగునీటి సౌకర్య పనులను ప్రారంభించారు.

G.RAMBABU, SOMPET
Published on: 10 Oct 2026 8:24 PM IST
Kanchili
X

Kanchili: అనాథాశ్రమానికి తాగునీటి సౌకర్యం కల్పించిన మాదిన రామారావు

Kanchili: కంచిలి మండలం ఎం.ఎస్‌.పల్లి పంచాయతీ పరిధిలోని పుడభద్ర గ్రామంలో ఉన్న అనాథాశ్రమానికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు రూ.2.50 లక్షల నిధులతో పనులు చేపట్టారు.

ఆయన చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కిషోర్‌, పాడి శ్రీకాంత్‌, శ్రీరాములు, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ, సోమేశ్‌, రమేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET