Kanchili: కంచిలి తహసీల్దార్ రమేష్ కుమార్ పునరావాస కేంద్రం పరిశీలన!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చొట్రాయిపురంలో అర్నబ్ తుఫాన్ బాధితులకు పునరావాసం. ఎంపీపీ పాఠశాల కేంద్రంలో బాధితులకు భోజన వసతి పరిశీలించిన తహసీల్దార్ రమేష్ కుమార్.

G.RAMBABU, SOMPET
Published on: 30 Oct 2026 6:26 AM IST
Kanchili
X

Kanchili: కంచిలి తహసీల్దార్ రమేష్ కుమార్ పునరావాస కేంద్రం పరిశీలన!

Kanchili: కంచిలి అర్నబ్ తుఫాను ప్రభావంతో కంచిలి మండలం చొట్రాయిపురం గ్రామంలో మెట్ట ప్రాంతంలో నివాసముంటున్న ఐదు కుటుంబాల ఇళ్లు కూలిపోవడంతో అధికారులు వారిని గుర్తించి పునరావాసం కల్పించారు.

బాధిత కుటుంబాల కోసం చొట్రాయిపురం ఎంపీపీ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి బాధితులకు అంగన్‌వాడీ టీచర్ బడ్డీ హేమలత ద్వారా భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాల పరిస్థితులను మండల తహసీల్దార్ రమేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వీఆర్వో రత్నాల కృష్ణారావును ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు సప్పటి శివరాంప్రసాద్, కుంబి చిట్టిబాబు, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ప్రధానోపాధ్యాయులు మడ్డు తిరుపతిరావు, గ్రామస్తుడు కొర్రాయి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET