Kanchili: అర్జునాపురంలో సర్పంచ్ అభ్యర్థి కాతిల లక్ష్మి ముమ్మర ప్రచారం
Kanchili: కంచిలి మండలం యక్కల పంచాయతీ అర్జునాపురంలో సర్పంచ్ అభ్యర్థి కాతిల లక్ష్మి గడపగడపకు వెళ్లి ప్రచారం; తాగునీరు, రోడ్ల అభివృద్ధిపై ఓటర్లకు భరోసా.
Kanchili: అర్జునాపురంలో సర్పంచ్ అభ్యర్థి కాతిల లక్ష్మి ముమ్మర ప్రచారం
కంచిలి: కంచిలి మండలం యక్కల గ్రామపంచాయతీ పరిధి అర్జునాపురంలో మంగళవారం సర్పంచ్ అభ్యర్థి కాతిల లక్ష్మి ముమ్మర ప్రచారం చేపట్టారు. ఆమె తనయుడు చందుతో కలిసి గ్రామంలోని ప్రతి వీధిలో, ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తాను చేపట్టబోయే కార్యక్రమాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై ప్రజలతో చర్చించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జీరు లోకునాధం, టోంకరావు, అర్జునాపురం గ్రామ పెద్దలు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో కాతిల లక్ష్మికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది.




