Kanchili: పెద్ద కొజ్జిరియా సర్పంచ్ అభ్యర్థిగా సంధ్యారాణి నామినేషన్!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ బొడ్డ రామ్ కుమార్ సతీమణి సంధ్యారాణి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Kanchili: పెద్ద కొజ్జిరియా సర్పంచ్ అభ్యర్థిగా సంధ్యారాణి నామినేషన్!
కంచిలి: కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొడ్డ రామ్ కుమార్ సతీమణి సంధ్యారాణి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మాజీ సర్పంచ్ బొడ్డ రామ్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల బరిలో నిలవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందడి నెలకొంది. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని సంధ్యారాణి అన్నారు.
గ్రామంలో తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని, యువతకు, మహిళలకు అండగా నిలుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాసాల తిరుమలరావు, బొడ్డ కవిబాబు, బొడ్డ సూర్యనారాయణ, బొడ్డ హరిబాబు పాల్గొన్నారు.




