Kanchili: కంచమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Kanchili: కంచిలి గ్రామదేవత కంచమ్మ తల్లి ఆలయ నూతన కమిటీని గ్రామస్తులు, దత్తత గ్రామాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Kanchili: కంచమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
Kanchili: కంచిలి గ్రామదేవత కంచమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీని ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కంచిలి గ్రామస్తులు, దత్తత గ్రామాల ప్రతినిధుల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా పైడిశెట్టి తిరుమలరావు, పొట్నూరు రమేష్‌కుమార్, అధ్యక్షుడిగా వంజరాన కేశవరావు, ఉపాధ్యక్షుడిగా వంకల ఉమాపతి, కార్యదర్శిగా కొల్లి పకీరు, సంయుక్త కార్యదర్శిగా గణప పాపారావును ఎంపిక చేశారు. కన్వీనర్లుగా ఊనా రవికుమార్, మునకాల పోలయ్య, గుజ్జు త్రినాథ్ తదితరులను నియమించారు. నూతన కమిటీకి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
సమావేశం సందర్భంగా ఎస్‌ఐ పి. పారినాయుడు ఆధ్వర్యంలో ఆలయం వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.




