Kanchili: కంచిలి ఎంపీటీసీల్లో కూటమి ఘనవిజయం ఎమ్మెల్యే బెందాళం అశోక్
Kanchili: కంచిలి మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్న కూటమి. ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్బాబును కలిసిన ఎంపీపీ అభ్యర్థి విమల.
Kanchili: కంచిలి ఎంపీటీసీల్లో కూటమి ఘనవిజయం ఎమ్మెల్యే బెందాళం అశోక్
కంచిలి: కంచిలి మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలను కూటమి కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎంపీపీ అభ్యర్థి మాదిన విమల రామారావు ఆధ్వర్యంలో గెలుపొందిన అభ్యర్థులు సోమవారం కవిటి మండలం రామయ్యపుట్టులోని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాదిన విమల రామారావుతో పాటు విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఘన విజయం సాధించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాడపూడి ఎంపీటీసీ పిలక బోగేసి, మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, విశ్రాంత ఉపాధ్యాయులు రామారావు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.




