Kanchili: మహాలక్ష్మమ్మతల్లికి ఎంపీపీ విమల రామారావు ప్రత్యేక పూజలు!
Kanchili: కంచిలి ఎంపీపీగా గురువారం ప్రమాణం చేసిన మాదిన విమల రామారావు అనంతరం కర్తలి మహాలక్ష్మమ్మతల్లి ఆలయ 15వ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు.
Kanchili: మహాలక్ష్మమ్మతల్లికి ఎంపీపీ విమల రామారావు ప్రత్యేక పూజలు!
కంచిలి: కంచిలి ఎంపీపీగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన మాదిన విమల రామారావు అనంతరం మండలంలోని కర్తలిలో జరిగిన మహాలక్ష్మమ్మతల్లి దేవాలయం 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మండలం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పైల శారద, ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, భగీరథి, కృష్ణ, రామారావు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




