Kanchili: కంచమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నర్తు దంపతులు
Kanchili: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కంచిలి కంచమ్మతల్లి అమ్మవారిని ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు దర్శించుకుని, రూ.5,116 విరాళం అందజేశారు.
Kanchili: కంచమ్మతల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నర్తు దంపతులు
Kanchili: కంచిలి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు తన సతీమణితో కలిసి కంచిలిలోని శ్రీశ్రీశ్రీ కంచమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి రూ.5,116 విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఎమ్మెల్సీ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ నూతన కమిటీ చైర్మన్ వంజరాన కేశవరావు, కమిటీ సభ్యులు దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ దంపతులు అమ్మవారిని ప్రార్థించారు.




