Kanchili: కంచిలి కంచమ్మ తల్లి నిజరూప దర్శనం ప్రారంభం!
Kanchili: కంచిలి కంచమ్మ తల్లి దేవీ నవరాత్రులలో భాగంగా గురువారం నిజరూప దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అలంకరణల వివరాలు ఇక్కడ చదవండి.
Kanchili: కంచిలి కంచమ్మ తల్లి నిజరూప దర్శనం ప్రారంభం!
Kanchili: కంచిలి దుర్గా నవరాత్రుల్లో భాగంగా కంచిలి మండల కేంద్రంలో వెలసిన ప్రసిద్ధ కంచమ్మ తల్లి నిజరూప దర్శనానం గురువారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. నవరాత్రులు ఐదో రోజు సందర్భంగా అమ్మవారిని చూడముచ్చటగా పూలతో అలంకరించి, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఉదయం 5:00 గంటల నుంచే కుంకుమార్చన, అభిషేకం, చండీ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా నవరాత్రుల్లో అమ్మవారి నిజరూప దర్శనం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ రోజు దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భక్తులందరూ ఈ అపూర్వ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంచమ్మ తల్లి కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, నిజరూప దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నారు.




