Kanchili: కంచిలిలో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసోత్సవం
Kanchili: కంచిలి మార్కెట్ యార్డులో కంచిలి, సోంపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు.
Kanchili: కంచిలిలో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసోత్సవం
Kanchili: కంచిలి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని సీడీపీఓ విమలకుమారి సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో కంచిలి, సోంపేట ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో మంగళవారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందేలా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ 2 చిట్టిబాబు సోంపేట ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ఆర్‌ఐ నర్సింహులు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు ధనలక్ష్మి, మంగమ్మ, నాగలక్ష్మి, నాగమణి, ఈశ్వరి, సునీత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.




