Palakonda: పాలకొండలో ఘనంగా జర్నలిస్టుల ఆత్మీయ అభినందన సభ!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సత్యమనాయుడు, ఇతర జర్నలిస్టులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఘన సత్కారం.
Palakonda: పాలకొండలో ఘనంగా జర్నలిస్టుల ఆత్మీయ అభినందన సభ!
Palakonda: పాలకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంధ్రజ్యోతి వి.సత్యమనాయుడు, మరియు సూర్య రిపోర్టర్ వెలమల రమణకు, అలాగే అక్రిడేషన్ కమిటీ సభ్యులు కథనం పత్రిక ఎడిటర్ యామాల ఈశ్వరరావుకు స్థానిక నక్కలపేటలో ఉన్నటువంటి షిరిడిసాయి కళ్యాణ మండపంలో పాలకొండ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు జర్నలిస్టుల మిత్ర బృందం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం పాలకొండ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ జొన్నలగడ్డ కామేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ఆంధ్రజ్యోతి సత్యం నాయుడుకు ఏపీడబ్ల్యూ జేఎఫ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో సత్కరించారు.
అలాగే ఏపీడబ్ల్యూజే యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ సూర్య వెలమల రమణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో వీరితో పాటు అక్రిడేషన్ కమిటీ సభ్యులు కథనం ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ యామాల ఈశ్వరరావును పాలకొండ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటూ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబం అంతా కష్టసుఖాలలో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు నేటికీ అక్రిడేషన్ లేని వారికి ఈ ముగ్గురు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు అలాగే పాలకొండ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి మన అందరము కలిసికట్టుగా
కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంధ్రజ్యోతి సత్యం నాయుడు పిలుపునిచ్చారు ఇంత ఘనంగా సత్కరించిన మన జర్నలిస్టు కుటుంబ సభ్యులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు, గౌరవ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ జొన్నలగడ్డ కామేశ్వరరావు ను కూడా ఘనంగా సత్కారం చేశారు, ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఉచితంగా వేదిక ను ఇచ్చిన షిరిడి సాయి సకల దేవతల ఆలయ ధర్మకర్త పల్లా కొండబాబును ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈనాడు నిరంజన్ ఈనాడు ప్రసాదరావు(చంటి) ఎన్టీవీ నాయుడు మన జిల్లా శంకర్ సత్యనారాయణ నానాజీ కైలాష్ సాహు నరసింహ శ్యామ్ ఖానూరు ప్రసాదరావు పాలవలస రామినాయుడు సుబ్రహ్మణ్యం(సుబ్బు) సీనియర్ జర్నలిస్ట్ బివి గురుబిల్లి, రవికుమార్ కనకం వెంకటరమణ రమేష్ జయం చందర్రావు ఏబీఎన్ జయరాం, నిర్ణయం సురేష్, కోటేశ్వరరావు, వంశి, సీనియర్ జర్నలిస్ట్ కొండదాడి రమేష్ గోన్న భక్తుల శ్రీనివాసరావు రావాడ రవికుమార్ ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు విశాలాంధ్ర నియోజకవర్గ బాధ్యుడు కాంతారావు తదితర జర్నలిస్టు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




