Srikakulam: శ్రీకాకుళంలో ఈ నెల 19న 'కౌశలం' మెగా ఉద్యోగ మేళా!
Srikakulam: శ్రీకాకుళంలో ఈ నెల 19న మెగా ఉద్యోగ మేళా.. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు.
Srikakulam: శ్రీకాకుళంలో ఈ నెల 19న 'కౌశలం' మెగా ఉద్యోగ మేళా!
Srikakulam: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కౌశలం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న నిర్వహించే ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.
స్థానిక జిల్లా ప్రజా పరిషత్ నూతన సమావేశ మందిరంలో శనివారం ఉదయం 8:30 గంటల నుంచి ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ప్రముఖ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,500 వేతనం అందుతుందని పేర్కొన్నారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ విద్యార్హతలు కలిగి, 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులని కలెక్టర్ వివరించారు. ఎటువంటి పూర్వ అనుభవం లేని ఫ్రెషర్స్ కూడా హాజరుకావచ్చని సూచించారు.
ఉద్యోగానికి ఎంపికైన వారికి వేతనంతో పాటు హాజరు బోనస్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, వర్క్ స్టేషన్ అలవెన్సులు లభిస్తాయని తెలిపారు. వీటితో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి, సమీప పట్టణాలకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి సంక్షేమ, చట్టబద్ధమైన ప్రయోజనాలు సమకూరతాయని ఆయన వెల్లడించారు.




