Kaviti: కవిటి: బెలగాం సర్పంచ్‌గా జీరు ధర్మారావు ఏకగ్రీవం!

Kaviti: కవిటి మండలం బెలగాం పంచాయతీ సర్పంచ్‌గా ఆర్ బెలగాంకు చెందిన జీరు ధర్మారావు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరు గ్రామాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

G.RAMBABU, SOMPET
Published on: 17 Nov 2026 7:17 PM IST
Kaviti
X

Kaviti: కవిటి: బెలగాం సర్పంచ్‌గా జీరు ధర్మారావు ఏకగ్రీవం!

కవిటి: కవిటి మండలం బెలగాం పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆర్ బెలగాంకు చెందిన జీరు ధర్మారావును సర్పంచ్‌గా పంచాయతీ పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బెలగాం పంచాయతీ పరిధిలోని ఆర్ బెలగాం, జాడుపూడి ఆర్ఎస్, జీ బెలగాం, రాపాకపుట్టుగ, బసవకొత్తూరు, శవసానపుట్టుగ గ్రామాల పెద్దలు, యువత, మహిళలు జీరు ధర్మారావుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

పంచాయతీ పెద్దలు అందరూ కలిసి చర్చించి, గ్రామ అభివృద్ధికి సరైన వ్యక్తి జీరు ధర్మారావే అని నిర్ణయించి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో బెలగాం పంచాయతీలో ఎన్నికల సందడి లేకుండా ఏకగ్రీవం సాధ్యమైంది. దీంతో పంచాయతీ ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. పెద్దలు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా జీరు ధర్మారావు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తానని, మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి, విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు.

గ్రామాల మధ్య ఐక్యతను కాపాడుతూ, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. బెలగాం పంచాయతీలో ఏకగ్రీవం సాధ్యం కావడం పట్ల గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఇది గ్రామాల ఐక్యతకు నిదర్శనమని అన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET